నేను నల్లగా ఉన్నానని ట్రోల్ చేస్తే… అగ్గిలా మారి వణికిస్తా – తమిళ సై

-

నేను నల్లగా ఉన్నానని ట్రోల్ చేస్తే… అగ్గిలా మారి వణికిస్తానని బాడీ షేమింగ్ చేసే ట్రోలర్స్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తన శరీరంపై పదే పదే విమర్శిస్తున్నారని అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళ్ సై. ‘నా శరీరం రంగు గురించి కొందరు పదే పదే విమర్శిస్తున్నారు.

నల్లగా ఉంటానని, నుదురు బట్టతలలా ఉంటుందని హేళన చేస్తున్నారు. నల్లగా ఉన్నావని ప్రత్యర్ధులు అంటే అగ్గిలా మారి వనికిస్తా. హేళన చేసేవారు సైతం ఓర్వలేనంత స్థాయికి చేరుతా. అని విమర్శకులను హెచ్చరించారు. నా శరీర ఛాయపై అదే పనిగా విమర్శిస్తున్నారని తమిళిసై ఆగ్రహం చేశారు.. నేను నల్లగా ఉన్నానంటే, అగ్గిలా మారుతానంటూ తమిళిసై వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news