నిజంగానే కవిత తప్పు చేస్తే శిక్షించాలి – తమ్మినేని వీరభద్రం

-

ఢిల్లీ మద్యం కుంభకోణం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజంగానే కవిత తప్పు చేస్తే శిక్షించాలని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కెసిఆర్ మీద, బిఆర్ఎస్ మీద బిజెపి వేధింపులు మానుకోవాలని సూచించారు. కక్ష సాధింపు కేసులు మానుకోవాలని హితవు పలికారు తమ్మినేని. తెలంగాణలో పరీక్ష పత్రాల లీక్ పై సిట్టింగ్ జడ్జిని పెట్టి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇక సిపిఐ, సిపిఎం కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. ఈనెల 9న రెండు పార్టీల ఉమ్మడి సభ ఉంటుందని, సీట్ల వ్యవహారంలో కూడా సర్దుకుపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. లెఫ్ట్ పార్టీల చరిత్రలో ఉమ్మడి సభ జరగడం ఇదే మొదటిసారి అని తెలిపారు తమ్మినేని. ఇక బిఆర్ఎస్ తో వచ్చే ఎన్నికల్లో కలుస్తామో లేదా అనేది చర్చనేలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news