తానా ఆధ్వర్యంలో CPR కార్యక్రమం

-

డెట్రాయిట్ తానా ఆధ్వర్యంలో నోవై అగ్నిమాపక దళంతో కలిసి CPR ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా కేర్స్ అధ్యక్షుడు పెద్దిబోయిన జోగేశ్వరరావు సమన్వయంలో నిర్వహించిన ఈ శిక్షణా సదస్సులో 40మంది ప్రవాసులు పాల్గొన్నట్లు తెలుస్తుంది. CPR శిక్షణ అనేది చాలా క్లిష్టమైన మరియు ముఖ్యమైన నైపుణ్యం, ఇది సమాజంలో అర్హులైన ప్రాముఖ్యతను ఇవ్వలేదు, ఎందుకంటే ఇది మన చుట్టూ ఉన్న ఎవరైనా కార్డియాక్ అరెస్ట్ కారణంగా కుప్పకూలినప్పుడు సహాయం చేయడానికి శిక్షణ పొందిన వ్యక్తులు ఉపయోగపడతారు. ఈ శిక్షణ తీసుకున్న వారు ఇలాంటి సమయంలో ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడగలరు అన్నమాట. ఈ కార్యక్రమంలో తానా ప్రాంతీయ ప్రతినిధి దుగ్గిరాల కిరణ్, సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు పంత్ర సునీల్, తానా మాజీ అధ్యక్షులు డా.బండ్ల హనుమయ్య, నాదెళ్ల గంగాధర్, తానా ఫౌండేషన్ అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, తానా ఫౌండేషన్ ట్రస్టీ యార్లగడ్డ శివరాం, రాం ప్రసాద్, ఉమా వొమ్మి, DTA అధ్యక్షుడు ద్వారకా ప్రసాద్, సాంస్కృతిక కార్యదర్శి మనోజ్, యాదం బాలాజీ తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తుంది.

CPR అంటే కార్డియో పల్మనరీ రేసెసిటేషన్. కార్డియో అంటే హార్ట్ అండ్ పల్మనరీ అంటే లంగ్స్ కి సంబంధించి, రేసెసిటేషన్ అంటే మెడికల్ టర్మ్ కు సంబందించిన పదం. CPR అనేది ఒక లైఫ్ ని కాపాడే టెక్నిక్ అన్నమాట. కార్డియాక్ అరెస్ట్ గానీ,లేదా హార్ట్ ఎటాక్ కానీ వచ్చినప్పుడు ఈ CPR శిక్షణ తీసుకున్న వారు సహాయం తో వెంటనే వారికి సకాలంలో వైద్యం అందిస్తే వారు బ్రతికే అవకాశం ఉంటుంది. అందుకే తానా ఆధ్వర్యంలో ఈ ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహించి దీనిపై అవగాహన కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news