నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణిస్తోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు ఆయన ఆరోగ్యం కుదుటపడింది అని ఎక్మో ద్వారా ఆయనకు చికిత్స అందివ్వడం లేదు అని ఆయన త్వరగా అనే కోలుకుంటారు అంటూ వైద్యులు ఎప్పటికప్పుడు బులిటెన్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయనకు మరింత మెరుగైన వైద్యం అందివ్వడం కోసం నారాయణ హృదయాలయ హాస్పిటల్ నుంచి విదేశాలకు ఎయిర్ అంబులెన్స్ సహాయంతో తారకరత్న ను తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే నందమూరి తారకరత్నకు బ్రెయిన్ చికిత్స జరిగింది అని స్కాన్ రిపోర్ట్స్ రాగానే వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స పొందడానికి ఆయనను విదేశాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా టిడిపి నేత అంబికా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా తారకరత్న మెదడుకు శస్త్ర చికిత్స జరిగింది… ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్కాన్ రిపోర్టు వచ్చిన వెంటనే డాక్టర్లు సలహా మేరకు తారకరత్నను ఏ క్షణమైనా విదేశాలకు తరలించే అవకాశం ఉంది అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఈ విషయం తెలిసి అభిమానులు మరొకవైపు మరింత ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని మెరుగైన చికిత్స కోసమే విదేశాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి నందమూరి తారకరత్న త్వరగా ఆరోగ్యవంతుడై పూర్తి ఆయుష్షుతో తిరిగి రావాలని అభిమానులు, కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యానికి అయ్యే ఖర్చులన్నింటినీ కూడా చంద్రబాబు ఆయన వారసుడు నారా లోకేష్ భరిస్తున్నట్లు తెలుస్తోంది.