టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ వెబ్‌సైట్‌.. ‘సాలు దొర.. సెలవు దొర’ అంటూ..

-

తెలంగాణలో ఎలాగైనా కాషాయం జెండా నాటాలనే లక్ష్యంతో ఉన్నారు బీజేపీ శ్రేణులు. ఇందుకోసం వీలు దొరికనప్పుడల్లా అధికార టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బీజేపీ నేతలు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ పాల‌న‌పై సాలు దొర‌.. సెల‌వు దొర పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న‌ట్లు బీజేపీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇంచార్జీ త‌రుణ్ చుగ్ ప్ర‌క‌టించారు. ఈ వెబ్ సైట్ ద్వారా కేసీఆర్ గ‌ద్దె దిగు… బీజేపీ పాల‌న‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న విష‌యాన్ని టీఆర్ఎస్‌కు నిత్యం గుర్తు చేస్తామ‌ని వెల్లడించారు త‌రుణ్ చుగ్.

Congress causing collapse of governance in Punjab, Governor should  interfere: BJP leader Tarun Chugh | India News,The Indian Express

ఈ మేర‌కు టీఆర్ఎస్ పాల‌న‌పై శ‌నివారం నిప్పులు చెరిగారు త‌రుణ్ చుగ్. కేసీఆర్ కుటుంబం క‌బంధ హ‌స్తాల్లో తెలంగాణ బందీ అయిపోయింద‌ని ఆరోపించారు త‌రుణ్ చుగ్. తెలంగాణ‌లో కేసీఆర్, ఆయ‌న కుటుంబ సభ్యులు మాత్ర‌మే పెత్త‌నం చెలాయిస్తున్నార‌ని విమ‌ర్శించిన త‌రుణ్ చుగ్.. కేసీఆర్‌, ఆయ‌న కేబినెట్ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
అలీబాబా 40 దొంగ‌ల మాదిరిగా తెలంగాణ‌ను దోచుకుంటున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు త‌రుణ్ చుగ్.

Read more RELATED
Recommended to you

Latest news