FLASH : ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ రేసులో టాటా సన్స్..!

ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ స్పాన్సర్‌షిప్ రేసులోకి టాటా సన్స్ కంపెనీ దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం బిడ్ దాఖలు చేసే గడువు ముగియడంతో మొత్తం 5 కంపెనీలు మాత్రమే పోటీలో నిలిచాయని తెలుస్తోంది. టాటా సన్స్‌తో పాటు, బైజుస్, రిలయన్స్ జియో, పతంజలి, అన్ అకాడమీ రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే బీసీసీఐ ఆగస్టు 18న ఐపీఎల్ కొత్త స్పాన్సర్ ఎవరో ప్రకటించనుంది.

ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌‌గా 2018 నుంచి వివో కంపెనీ ఏటా రూ.440 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తోంది. వివో.. 2022 వరకు మొత్తం ఐదేళ్లపాటు ఒప్పందం చేసుకుంది. కానీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఈ ఏడాదికి తమ ఒప్పందాన్ని ఉపసంహరించుకుంది. దీంతో బీసీసీఐ ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను దాఖలు చేసింది. ఇకపోతే యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే.