ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశప్రజలందరికీ 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆత్మార్పణ చేసిన వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ. కుల, మత, లింగ వివక్షతలేని సమసమాజ స్థాపనకు కృషిచేస్తూ. పేద-ధనిక, గ్రామీణ-పట్టణ అంతరాలు చెరిపేసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములమవుదాం.’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆత్మార్పణ చేసిన వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ. కుల, మత, లింగ వివక్షతలేని సమసమాజ స్థాపనకు కృషిచేస్తూ. పేద-ధనిక, గ్రామీణ-పట్టణ అంతరాలు చెరిపేసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములమవుదాం.#IndiaIndependenceDay pic.twitter.com/SY7vIWr28i
— Vice President of India (@VPSecretariat) August 15, 2020
అలాగే దేశ ప్రజలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియాజేశారు. ‘బానిసత్వపు సంకెళ్ళను తెంచుకుని స్వేచ్చను పొందిన రోజు ఇది. హక్కుల కోసం పోరాడి విజయం సాధించిన శుభదినం. ఏ దేశంలోనూ లేని రీతిలో ప్రాథమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను మనకు అందించారు పెద్దలు. వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
బానిసత్వపు సంకెళ్ళను తెంచుకుని స్వేఛ్చను పొందిన రోజు ఇది. హక్కుల కోసం పోరాడి విజయం సాధించిన శుభదినం. ఏ దేశంలోనూ లేని రీతిలో ప్రాధమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను మనకు అందించారు పెద్దలు.(1/2)#IndiaIndependenceDay #స్వాతంత్ర్యదినోత్సవం pic.twitter.com/noM1PZ9ByJ
— N Chandrababu Naidu (@ncbn) August 15, 2020