వ్యవసాయ రంగంలో విలువలకు ప్రాధాన్యత ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎర్రకోట వద్ద ప్రసంగంలో జాతిని ఉద్దేశించి ఆయన పలు వ్యాఖ్యలు చేసారు. వ్యవసాయ మార్కెట్ లో నూతన శకానికి నాంది పలికామని మోడీ వివరించారు. వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించామని ఆయన అన్నారు. ప్రభుత్వ బంధనాల నుంచి రైతులను విముక్తి చేస్తున్నామని మోడీ అన్నారు.
రైతులే స్వయంగా ఆహార శుద్ధికి ముందుకు వచ్చే విధంగా తాము ప్రోత్సహిస్తున్నామని అన్నారు మోడీ. స్వచ్చమైన తాగునీటితో ఆరోగ్య సమస్యలను తీర్చవచ్చు అని మోడీ చెప్పారు. పట్టణాలు గ్రామాల్లో కొత్త మౌలిక వసతిని చూపించామని మోడీ వివరించారు. ఆత్మ నిర్భర భారత్ లో రైతులే చాలా కీలకమని వ్యాఖ్యలు చేసారు. వ్యవసాయ మార్కెటింగ్ ని ఇంకా పెంచే ఉద్దేశం తమకు ఉందని అన్నారు. ఏ మూలన అయినా సరే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు అని మోడీ వివరించారు.