స్టేషన్ ఘనపురం టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ విషయంలో కేసీఆర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. స్టేషన్ ఘనపురం నియోజవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. తనకు సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల్లోకి విస్తృతంగా పర్యటిస్తానన్నారు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు 16, 17, 18 తేదీలలో జాతీయ సమైక్యత దినాన్ని ఘనంగా జరుపుకోవాలి…
అనిగిమనిగి ఉన్న వారు, TRS పార్టీ నాది అనుకునే వారు విధిగా ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడితే క్షమించేది లేదు టికెట్ విషయంలో కేసీఆర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. కాగా… నేడు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో జరిగిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కనిపించలేదు. కడియం శ్రీహరి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది.