Gajuwaka Conductor Jhansi : మళ్లీ మాస్ డాన్స్ తో అదరగొట్టిన లేడీ కండక్టర్ ఝాన్సీ.. వీడియో వైర‌ల్‌..

-

గాజువాకకు చెందిన లేడీ కండక్టర్‌ ఝాన్సీ ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే.. చాలు.. లేడీ కండక్టర్‌ ఝాన్సీ డాన్స్‌ కనిపిస్తోంది. ఈ అమ్మడు తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీలో పల్సర్‌ బైక్‌ పాట చేసింది. కేవలం ఒక్క పాటకు డాన్స్‌ చేసి.. ఓవర్‌ నైట్‌ సెలబ్రిటీ అయిపోయింది.

అంతేకాదండోయ్‌.. ఇంటర్నెట్‌ లో ఆర్టీసీ ఝాన్సీ గా గుర్తింపు సంపాదించికుంది. ఝాన్సీ ప్రస్తుతం గాజువాక బస్‌ డిపోలో కండక్టర్‌ గా పనిచేస్తూ.. డాన్స్‌ ఫర్ఫామెన్స్‌ లు కూడా చేస్తోంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా మరో ఫర్ఫామెన్స్‌…ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఝాన్సీ.

శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో భాగంగా.. తాజాగా వెంటపడి వచ్చేవాళ్లు కుర్రాళ్లు.. అనే ఐటమ్‌ సాంగ్‌ కు స్టెప్పులేసి.. అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను ఈటీవీ బృందం విడుదల చేసింది. ఈ ప్రోమోలో కూడా లేడీ కండక్టర్‌ ఝాన్సీ.. రెచ్చిపోయి డాన్స్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news