ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి గాను తెలుగుదేశం పార్టీ తో పొత్తు పెట్టుకుంది. ఇన్నాళ్ళు వామపక్షాలతో కలిసి అమరావతి ఉద్యమం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వామపక్షాలతో కలిసి ముందుకి వెళ్తుంది. ప్రజా సమస్యలపై వామపక్షాలతో కలిసి పోరాడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశమయ్యారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై కీలక చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామకృష్ణ.. రేపటి లోగా దీనిపై పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల పొత్తు గురించి చంద్రబాబుతో చర్చించామని అన్నారు. సీపీఐతో సర్దుబాటు చేసుకోవాలని కేడర్‌కు చంద్రబాబు సూచించారని అన్నారు.
రేపటి లోగా సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వస్తుందని ఆయన అన్నారు. సీపీఐ పోటీచేసే చోట కూడా అభ్యర్థులను నిలబెట్టవద్దని సూచించామన్నారు. సీపీఎం-సీపీఐ కలిసి ఎన్నికలకు వెళ్తాయని అన్నారు. ప్రభుత్వంపై పోరాడేందుకు కలిసి పనిచేస్తున్నామని అన్నారు. గత కొంత కాలంగా అమరావతి ఉద్యమంలో రెండు పార్టీలు కలిసి పోరాడుతున్నాయి. ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ తో వామపక్షాలు పొత్తు పెట్టుకున్నాయి.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు బిజెపితో కలిసి వెళ్ళడంతో ఆ తర్వాత వామపక్షాలు దూరమయ్యాయి. 2009 ఎన్నికల్లో మహాకూటమి అనే పేరుతో ఒక కూటమి ఏర్పాటు చేసి టీడీపీ తెరాస, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ముందుకి వెళ్ళింది. ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఈ పరిణామం కీలకంగా మారింది.