”వరుడు కావలెను” రిలీజ్ డేట్ ఫిక్స్

-

టాలీవుడ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ”వరుడు కావలెను”. సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా… లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు మరియు సాంగ్స్ తో ఓ రేంజ్‌ లో రెస్పాన్స్‌ వచ్చింది. లుక్‌ పరంగా హీరో నాగశౌర్య మరియు హీరోయిన్‌ రీతూ వర్మ ఇద్దరూ కూడా మంచి మార్కులు కొట్టేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ వరుడు కావలెను సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీ ని అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. ”వరుడు కావలెను” సినిమా ను దసరా కానుకగా… అంటే అక్టోబర్‌ 15 వ తేదీన విడుదల చేయనుంది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. కాగా..ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే.. దిగు దిగు నాగ అనే సాంగ్‌ కూడా యు ట్యూబ్‌ ను షేక్‌ చేసేస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news