వైసీపీకి ఎదురుదెబ్బ…టీడీపీ చేతిలోకి తిరుపతి డిప్యూటీ మేయర్‌ !

-

వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది…టీడీపీ చేతిలోకి తిరుపతి డిప్యూటీ మేయర్‌ పదవి వెళ్లింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన ఈ ఎన్నికలో డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి R. C. మునికృష్ణ విజయం సాధించారు.

TDP has bagged the post of Deputy Mayor of Tirupati Municipal Corporation

టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు మద్దతుగా 26 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి లడ్డూ భాస్కర్‌కు 21 ఓట్లు దక్కాయి. ఇది ఇలా ఉండగా… మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో తిరుపతిలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఎస్వీ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపించగా.. తాము క్షేమంగానే ఉన్నామని వారు వీడియోలు రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news