సోషల్ మీడియా తెలుగుదేశం కార్యకర్తలను మరోసారి భ్రమలో ఉంచుతుందా అంటే ? ప్రస్తుత పరిస్తితులు అవన్నీ అవుననే అంటున్నాయి. క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవ పరిస్తితులను అంటే గ్రూపు రాజకీయాలు వాటి పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చి సోషల్ మీడియా లో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శస్తున్నాయి టీడీపీ శ్రేణులు. దీని వల్ల పార్టీకి లాభం కంటే ఎక్కువ నష్టమే కలుగుతుంది. ఎందుకంటే వారి వారి నియోజకవర్గ వాస్తవ పరిస్థితులు ఏంటి అనే విషయం ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు.
ఇవాల్టి రోజుల్లో సోషల్ మీడియా అందరికి అందుబాటులోని వచ్చింది. వాస్తవానికి ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు పర్యటనలకు జనం భారీగానే వచ్చారు. అప్పుడు కూడా మీడియాలో చాలా హడావుడి జరిగింది. కానీ జనం వచ్చినంతగా ఓట్లు రాలేకపోయాయి. పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇంకా చెప్పాలంటే బాబు అధికారంలో ఉన్న ఐదు రోజుల్లోనూ సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలు, ఫేక్ బ్యాచ్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.
వీళ్ళ హడావుడి లో వీరు మునిగి ఉంటే వైసీపి వాళ్ళు టిడిపిలో ఉన్న లొసుగులను చక్కగా వాడుకుంటున్నారని కొందరు సీనియర్ కార్యకర్తలు వాదించినా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. ఎన్నికలకు ముందు ఇదే తంతు జరగగా… ఇప్పుడు కూడా దాదాపుగా అదే జరుగుతోంది. చంద్రబాబు జిల్లా సమావేశాలకు పార్టీ శ్రేణులు ప్రజలు భారీగా వస్తున్నారు. వీటిల్లో చంద్రబాబు ఫొటోపెట్టి ఆయన మీటింగులకు వచ్చిన జనం ఫోటోలు తో సోషల్ మీడియా నానా హడావుడి చేసినంతమాత్రన పార్టీకి ఒరిగేది ఏమీ లేదనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
చివరకు చినబాబు లోకేష్ సైతం తన గురించి, పార్టీ గురించి, వైసీపీ వ్యతిరేకత గురించి ఎవరైనా సోషల్ మీడియా పోస్టులు చూపిస్తే తెగ సంతోష పడిపోతున్నాడట. దీని వల్ల పార్టీకి ఉపయోగమా ? అన్నది వాళ్లే ఆలోచించుకోవాలి. ఈ విషయాన్ని త్వరగా గ్రహించి పార్టీకి ఉపయోగపడే వాస్తవాలను సోషల్ మీడియా ద్వారా కార్యకర్తలకు సూచించడం మంచిది. అంతేకాని సోషల్ మీడియాలో భజన చేయడం ఏ మాత్రం పార్టీకి పనికొచ్చే అవకాశంలేదు. మరి ఈ భ్రమల నుంచి ఆ పార్టీ ఎప్పుడు బయటపడుతుందో చూడాలి. పార్టీ అధిష్టానం ఈ భజన మీద ఎక్కువ ఆసక్తి చూపించడం కూడా పార్టీకి ఇబ్బందిగా మారింది అనేది వాస్తవం.