ఏపీలో టీడీపీకి భారీ షాక్‌… వైఎస్సార్‌సీపీలో చేరిన ముఖ్యనేత

-

ఏపీలో విప‌క్ష టీడీపీకి షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు బీజేపీ, వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆదివారం ఆ పార్టీకి మ‌రో అదిరిపోయే షాక్ త‌గిలింది.విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ కీలక నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. విశాఖ డైరీ చైర్మన్‌ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్‌, కుమార్తె రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం వైసీపీ కుండువా కప్పుకున్నారు.

tdp leader adari anand kumar joins in ysrcp
tdp leader adari anand kumar joins in ysrcp

అడారి ఫ్యామిలీకి సుదీర్ఘ‌కాలంగా టీడీపీతో అనుబంధం ఉంది. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో రైతుల‌తో ఈ ఫ్యామిలీకి డెయిరి ద్వారా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఫ్యామిలీ య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గానికి చెందినా విశాఖ‌, తూర్పు గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో పాడి రైతుల్లో మంచి గుర్తింపు పొందింది. ఈ ఎన్నిక‌ల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అడారి ఆనంద్‌ పరాజయం పాలయ్యారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచే ఆయ‌న పార్టీ మారిపోతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక తాజాగా అడారి ఆనంద్‌తో పాటు ర‌మాదేవితో పాటు డెయిరీ స‌భ్యులు, డైరెక్ట‌ర్లు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిపోయారు. మంత్రి అవంతి శ్రీనివాస‌రావు వీరి చేరిక‌లో కీల‌క పాత్ర పోషించారు. ఇక ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు కూడా పార్టీ మారేందుకు రెడీగా ఉన్నార‌ట‌. వీరిని వైసీపీలో చేర్చే బాధ్య‌త అవంతి తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక త్వ‌ర‌లోనే గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో గ్రేట‌ర్ విశాఖ‌లో ఉన్న ప‌లువురు టీడీపీ కీల‌క నేత‌ల‌ను పార్టీలో చేర్చుకునేందుకు స్వ‌యంగా వైసీపీ అధిష్టాన‌మే రంగంలోకి దిగ‌నుంది. ఇక న‌గ‌రంలో ఉన్న ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేల‌కు వైసీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో వ‌ల విసురుతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో చేర్చుకోవాలంటే ముందుగా త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌న్న కండీష‌న్ ఉండ‌డం

Read more RELATED
Recommended to you

Latest news