ఏపీలో మూడు రాజధానులకు సంబంధిత బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదముద్ర వేయటం ఆంధ్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిందన్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు ఊహించని విధంగా గవర్నర్ మూడు రాజధానులు బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పలుచోట్ల ఆందోళనలు కూడా చేపడుతున్నారు విపక్ష పార్టీల నేతలు. ఇక తాజాగా గవర్నర్ ఏపీ రాజధాని వికేంద్రీకరణ సీఆర్డీఏ బిల్లులకు ఆమోదం తెలపడానికి నిరసనగా టీడీపీ నేత బీటెక్ రవి తన ఎమ్మెల్సి పదవికి రాజీనామా చేశారు,
రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పంపించారు బీటెక్ రవి. మరోవైపు వికేంద్రీకరణ సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రాజధాని రైతులందరూ మరోసారి భగ్గుమన్నారు. మరోసారి రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఇక అటు ఐకాస నేతలు కూడా గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నారు. పాలన రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు, వెంటనే గవర్నర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.