ఇళ్ళ పట్టాల విషయంలో ఏపీ సర్కార్ అబద్దం ఆడిందా…?

-

బీసీ కార్పొరేషన్లకు చెందిన రూ.3,432కోట్లను అమ్మ ఒడి పథకానికి, బీసీలకు చెందిన వసతి దీవెన పథకానికి చెందిన రూ.202కోట్లను జీవోనెం-1243తో ఇతర పథకాలకు మళ్లించింది వాస్తవం కాదా? అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ప్రశ్నించారు. ఈ విధంగా బీసీ కార్పొరేషన్లకు చిల్లిగవ్వ లేకుండా చేసి, 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తే దేనికి ఉపయోగం? అని ఆయన నిలదీశారు. బీసీలకు ఏపీలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసారు.

56 కార్పొరేషన్లతో 800 మందికి పదవులిస్తున్నామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం, ఆయా పదవులు తీసుకున్నవారు బీసీలను ఏం ఉద్ధరిస్తారో చెప్పాలని ఆయన ఈ సందర్భంగా సవాల్ చేసారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు రూ.లక్షా 20 వేల కోట్లు కాగా, వచ్చినఆదాయం లక్షా 60 వేల కోట్లు అని అన్నారు. మొత్తంగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.2 లక్షల 80 వేల కోట్లు అని వివరించారు. ప్రభుత్వానికి వచ్చిన మొత్తం రూ.2 లక్షల 80 వేల కోట్లలో బీసీలకు ఖర్చుచేసింది కేవలం రూ. 33 వేల కోట్లు.. అంటే కేవలం 12శాతం మాత్రమే అని చెప్పారు. ఆ 12 శాతం బీసీల సంక్షేమంలో ఇంకా చేతికివ్వని ఇళ్లపట్టాల పథకాన్ని కూడా కలిపేశారు అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 13లక్షల 42వేలమంది బీసీలకు, రూ.2,700కోట్లతో ఇళ్లపట్టాలు ఇచ్చేసినట్లు చెప్పారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news