అధికారంలో ఉన్నప్పుడైనా, ప్రతిపక్షానికి పరిమితమైనా టీడీపీ టార్గెట్ మాత్రం జగన్. అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్ని ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలో అన్నీ రకాలుగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టారు. ప్రతి విషయంలోనూ అవహేళన చేశారు. ముఖ్యంగా జగన్ జైలుకు జీవితంపై, ఆయన కేసులు గురించి పదే పదే మాట్లాడి ఎగతాళి చేశారు. ఇలా చేయడం వల్ల జనాల్లో జగన్పై సానుభూతి మరింత పెరిగింది. దీని వల్ల టీడీపీ నెగిటివ్ అయింది తప్పా, జగన్కు మంచే జరిగింది.
ఇక జగన్కు ఎంత మంచి జరిగిందో 2019 ఎన్నికల్లో తేలింది. సరే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాకైనా టీడీపీ నేతలు మారాలి కదా. కానీ టీడీపీ నేతల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా ఓడిపోయి బాగా ఖాళీగా ఉండటం వలన అనుకుంటా, ప్రతిరోజూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇటు మీడియా, అటు సోషల్ మీడియా వేదికగా జగన్పై విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే ఇలా చేయడం వల్ల జగన్కు ఉన్న ప్రజాదరణ మాత్రం తగ్గించలేకపోయారు. ఇలా ప్రజాధరణ జగన్ని టార్గెట్ చేయడం మాత్రం టీడీపీ నేతలు ఆపడం లేదు. మళ్ళీ ఆయన కేసులు గురించి మాట్లాడుతూ, ఇంకా లాభం జరిగేలా చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి కేసులు గురించే వెళ్లారంటూ టీడీపీ సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కూడా జగన్, ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఏపీలో టీడీపీ నేతలు మళ్ళీ పాత పాట పాడటం మొదలుపెట్టారు.
యనమల, దేవినేని ఉమా లాంటి వారు జగన్ కేసులు గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. తన కేసులపై కోర్టులు రోజువారీ విచారణ ప్రారంభిస్తే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందోనన్న భయంతోనే జగన్ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా విమర్శలు చేయడం వల్ల టీడీపీ నేతలే జనాల్లో చులకన అవుతున్నారు తప్పా, జగన్కు ఎలాంటి ఇబ్బంది ఉండటం లేదు. ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతలే, జగన్ని బాగా లేపుతున్నట్లు కనిపిస్తోంది.
-vuyyuru subhash