కరోనా వల్ల ప్రపంచం, దేశం, రాష్ట్రం అన్నీ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. మునుపెన్నడూ చూడనంతగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో.. కరోనా వల్ల లాభపడింది ఎవరైనా ఉన్నారంటే… టీడీపీ నేతలు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అవును… అటు పార్టీ పరంగా.. ఇటు నాయకులుగా.. మరోపక్క వ్యక్తిగతంగా కరోనా అనే సమస్య టీడీపీ నెత్తిన పాలుపోసిందనే కామెంట్లు బలపడుతున్నాయి.
ఒకపక్క అమరావతిలోనే పూర్తి రాజధాని ఉండదని ఏపీ సర్కార్ ప్రకటించిన నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో పోరాటాలు చేసే అవకాశాన్ని టీడీపీ కోల్పోయిందంటె కారణం.. కరోనా! ప్రజలకు నేరుగా సమాధానాలు చెప్పనవసరం లేకుండా… ప్రజల ప్రశ్నలకు స్పందించాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లో ఏకపక్ష ఉపన్యాశాలు ఇచ్చే అవకాశం చంద్రబాబుకు దక్కిందంటే దానికి కారణం.. కరోనా! ఇదే సమయంలో అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడికి కూడా ప్రస్తుతం కరోనా ప్లస్ అయ్యిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!
అవును… ఫైల్స్ ఆపరేషన్ పేరుచెప్పి సుమారు 40రోజులుగా జైల్లో ఉండాల్సిన అచ్చెన్నా ఆసుపత్రిలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ సమస్యకు అన్ని రోజులు రెస్ట్ అవసరమా అనే ప్రశ్నల సంగతి కాసేపు పక్కనపెడితే… తాజాగా అచ్చెన్నాకు కరోనా అనే వార్త ఒక వర్గం మీడియాలో వచ్చింది! దీంతో… ఆ సమస్యలో నిజానిజాల సంగతి దేవుడెరుగు కానీ… ఈ పేరుచెప్పి మరో రెండు మూడు వారాలు ఆసుపత్రిలోనే రెస్ట్ తీసుకునే అవకాశం అచ్చెన్నాకు దక్కిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!!
దీంతో… కరోనా వల్ల ప్రపంచం అంతా ఇబ్బందులు పడుతుంటే… టీడీపీ నేతలకు మాత్రం నెత్తిన పాలుపోస్తోందనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి!!