చంద్రబాబుకి వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యే… షాక్ లో కార్యకర్తలు…!

-

ఒక పక్క రాజకీయంగా బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేల వ్యవహారశైలి చుక్కలు చూపిస్తుంది. ఓటమి నుంచి బయటకు వస్తున్నాం అనుకుంటున్న తరుణంలో కార్యకర్తలను ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు విధేయులు అనుకున్న వాళ్ళు కూడా జెండా వదిలేయడం కార్యకర్తలను పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వ్యవహారం చల్లబడింది, ఆయన పార్టీకి దూరమైనా మిగిలిన ఎమ్మెల్యేలు వెళ్ళే అవకాశం లేదని, భావిస్తున్న తరుణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మొదటి సారి ఎమ్మెల్యే అయిన మద్దాలి గిరి ముఖ్యమంత్రి జగన్ ని ఆకాశానికి ఎత్తడం పార్టీ కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు.

వాస్తవానికి ఆ ఎమ్మెల్యే 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసారు. అప్పుడు ఓటమి పాలైనా సరే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, కార్యకర్తలకు దగ్గరగా ఉండటంతో చంద్రబాబు మళ్ళీ ఆయనకు అవకాశం ఇచ్చారు.

ఈ సారి నియోజకవర్గం మార్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి విజయం సాధించారు. వాస్తవానికి గిరికి ఆర్ధిక సామర్ద్యం తక్కువ. అయినా సరే సామాజిక వర్గ లెక్కలు చూసిన చంద్రబాబు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇక చంద్రబాబు నమ్మిన వ్యక్తుల్లో గిరికి పేరుంది. పార్టీ కోసం ఏడేళ్ళ నుంచి కష్టపడట౦, తనకు చేతనైన సాయం చేయడంతో చంద్రబాబు నమ్మారు. అయినా సరే గిరి అనూహ్యంగా పార్టీకి, చంద్రబాబుకి వెన్నుపోటు పొడిచారని కార్యకర్తలు వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news