ఎలా చూసుకున్నా అటు లోకేశ్ కు ఇటు వైసీపీకి మధ్య తగాదా ఇప్పట్లో తేలదు. అలా అని వైసీపీ తప్పులు చేయడం ఆపుతుందా లేదు కదా ! పదే పదే తప్పులను పునరావృతం చేస్తోంది. ఎందుకంటే టీడీపీని ఇరకాటంలో పెట్టి తాము పై చేయి సాధించాలని ఆ ఇద్దరూ పరితపిస్తున్నారు కనుక ! వాళ్లిద్దరే కాదు నిన్నటి జూమ్ మీటింగ్ పరంగా చాలా మంది వైసీపీ నాయకులు ఆయన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడాలనుకుని తడబడ్డారు.
కొన్ని సార్లు లోకేశ్ చెప్పాలనుకున్న మాట చెప్పనివ్వకుండానే కలబడ్డారు. ఏదేమయినా చినబాబుతో చర్చకు తాము సిద్ధమేనని చెప్పిన ఆ ఇద్దరూ ఇకపై కూడా ఆయనపై మాటల దాడి కొనసాగించనున్నారు. కనుకనే టీడీపీ కూడా అలర్ట్ అయింది. ఇకపై మరింత జోరుగా దూసుకుని పోయి, వైసీపీ నాయకుల నైజాన్ని ఆధారాలతో సహా బయటపెట్టాలని యోచిస్తోంది టీడీపీ.
వాస్తవానికి పది తప్పిన పిల్లలతో మాట్లాడాలనుకోవడం తప్పేం కాదు. కానీ పద్ధతి తప్పిన నాయకుల తీరుతోనే అంతటా గందరగోళం నెలకొని ఉంది. ఇదే సమయాన లోకేశ్ వర్గాలు పూర్తిగా అప్రమత్తం అయి ఉన్నాయి. రేపటి నుంచి ఏపీడీసీ పూర్తిగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వైసీపీ అధికారిక కార్యక్రమాల ప్రచారం ఊపందుకోనున్నందున టీడీపీ మరింత అప్రమత్తం అయి ఉంది. వైసీపీ చెప్పే మాటలకు ఆన్లైన్ కౌంటర్లకు, ఆఫ్లైన్ కౌంటర్లకు సిద్ధం అవుతోంది. ఇప్పటిదాకా అంటే మూడేళ్ల లో వైసీపీ సర్కారు చేసిన తప్పిదాలనే ఫోకస్ చేయాలని నిర్ణయించింది.
మరోవైపు చినబాబుతో పాటు మిగతా నాయకులు కూడా కలిసి ప్రత్యక్ష పోరుకు సిద్ధం అవుతున్నారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై వైసీపీ ఏకపక్షంగా వెళ్తూ, వాటిని అధికారుల సాయంతో జేసీబీలు పెట్టి మరీ ! కూల్చేస్తుండడంతో టీడీపీ అప్రమత్తం అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కుప్పం మరియు మంగళగిరి నియోజకవర్గాల్లో అదేవిధంగా వీలుంటే పులివెందులలో కూడా అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సిద్ధం అవుతామని అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను మరితంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లే క్రమాన పోలీసు ఒత్తిళ్లకు కూడా లొంగబోమని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఎలా అయినా లోకేశ్ కు మద్దతుగా ఉండి, నిన్నటి మాదిరిగానే పోరాటం చేస్తామని అచ్చెన్న, అయ్యన్న లాంటి ఉత్తరాంధ్ర లీడర్లు చెబుతున్నారు. కనుక ఇకపై మరింత ఉద్ధృతంగా పోరు ఉండబోతోందని, అందుకు వైసీపీ సిద్ధంగా ఉండాలని లోకేశ్ వర్గాలు పదే పదే అదే మాటను ప్రస్తావిస్తూ ఉన్నాయి.