వదల మంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం అన్నట్టుగా మారిపోయింది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరిస్థితి. ప్రస్తుతం ఈయన కేంద్రంగా టీడీపీలో అంతర్మథనం జరుగుతోంది. పార్టీలో ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు చంద్రబాబు త్వరలోనే పార్టీ పగ్గాలను తన వారసుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు అప్పగించాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన వ్యూహాత్మకంగా కార్యాచరణ అధ్యక్ష పదవిని తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఇంతలోనే పెద్ద ఎత్తున దుమారం రేగింది. లోకేష్ లీడింగ్‌పై అనేక ఆరోపణలు కమ్ముకున్నాయి. విఫలమైన నాయకుడిగా ముద్ర వేసేందుకు చాలా మంది ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన మంగళగిరి ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసి పరాజయం పాలు కావడం, 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఎమ్మెల్సీగా మారి.. 2017లో ప్రభుత్వంలో మంత్రిగా చక్రం తిప్పడం, సర్వం తానై వ్యవహరించడం వంటి కారణాలు పార్టీలో సీనియర్లకు రుచించలేదు.
దీంతో అప్పట్లోనే కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, అయ్యన్న పాత్రుడు వంటి వారు పరోక్షంగాను, ప్రత్య క్షంగాను విమర్శలు చేశారు. ఇక,ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి ముఖ్యంగా లోకేష్ ప్రచారం చేసిన చోట పార్టీ నాయకులకు సంప్రదాయంగా పడుతున్న ఓట్లు కూడా పడకపోవడానికి చిన్నబాబే కారణమంటూ ప్రచా రం జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆయనకు కార్యాచరణ అధ్యక్ష పదివిని కట్టబెట్టనున్నారనే ప్రచారం జరుగుతుండడంతో సీనియర్లలో కాక పుడుతోంది.
ఈ క్రమంలోనే లోకేష్‌పై ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నాయకులు లోకేష్ లీడర్ షిపను ఒపపుకొన్నా.. సీనియర్లలో మాత్రం తేడా కొడుతోంది. దీంతో ఇప్పుడు లోకేష్‌ను ఏం చేయాలనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి కొత్త పదవీ ఇవ్వకుండా.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని బట్టి నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.