ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి. అంతేకాకుండా దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరియు చట్టాలు తమ రాష్ట్రాలలో కూడా ఇంప్లిమెంట్ చేయటానికి ఇష్టపడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో జగన్ పరిపాలన పట్ల దేశ వ్యాప్తంగా మంచి పాజిటివ్ వేవ్ ఏర్పడింది. కాగా ఇటీవల జగన్ ఉగాది పండుగ నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేదలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి రెడీ అయినట్లు ఏపీ మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.
ఇందుకోసం ఆల్రెడీ ఇప్పటికే క్యాబినెట్ తో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఈ సమావేశంలో ఆయా జిల్లాల్ని ఓ యూనిట్‌గా చేసి, ప్రత్యేక అధికారుల్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో భూ సమీకరణ లో ఎక్కడా కూడా వివాదం రాకూడదని అధికారులకు జగన్ గట్టిగా ఆదేశించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భూ కొనుగోలు విషయం మొత్తం కలెక్టర్లు చూసుకోవాలని జగన్ సూచించారట.
దీంతో 25 లక్షల ఇళ్లు జగన్ ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంపై మంచి ఆదరణ వైసీపీ ప్రభుత్వం పై వస్తుంది. ఇదే సమయంలో కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా 25 లక్షల ఇళ్ల పట్టాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు ఇవ్వడం పట్ల జై కొడుతున్నారు. ఇది చాలా మంచి నిర్ణయం, జగన్ తీసుకుంది కరెక్ట్ అంటూ పొగుడుతున్నారు. ముఖ్యంగా భూమి కొనుగోలు విషయంలో కలెక్టర్లను ఇన్వాల్వ్ చేయటం జగన్ తీసుకున్న అతి మంచి నిర్ణయం అని కరుడుగట్టిన టిడిపి కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు.