విజయారెడ్డికి తెలుగుదేశం పార్టీ మద్దతు

ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డికి స్థానిక తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా విజయారెడ్డి మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ వర్గాల మద్దతు తమకు ఎంతో కీలకమన్నారు. ఎన్టీఆర్, పీజేఆర్‌లు ప్రజల కోసం పని చేసిన నాయకులు అన్నారు. తాను కూడా వారి అడుగుజాడల్లో నడుస్తున్నానని, అలాంటి తనకు టీడీపీ శ్రేణుల మద్దతు ఎంతో ప్రయోజనకరమన్నారు. అందరినీ కలుపుకుపోతూ కాంగ్రెస్‌తో పాటు టీడీపీ నాయకుల సూచనల మేరకు ప్రజల్లోకి వెళ్తానన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తాను పని చేస్తానని హామీ ఇచ్చారు.

తండ్రి బాటలో తనయ

టీడీపీ తరపున కార్పొరేటర్లుగా పోటీ చేసిన నాయకులు బాలాజీ గోస్వామి, పి.వంశీకృష్ణ, నల్లెల కిషోర్, ప్రవీణ్, నరసింహ, శ్రీనివాస్ నాయీ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా కాంగ్రెస్‌కు, దివంగత మాజీ సీఎల్పీ నేత పి.జనార్ధన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి గెలుపుకు కృషి చేస్తామని ప్రకటించారు. విజయా రెడ్డిని ఎన్నికల్లో గెలిపిస్తామని అనంతరం ఎన్టీఆర్, పీజేఆర్లలా ఆమె మంచి పేరు తెచ్చుకోవాలని బాలాజీ గోస్వామి కోరారు. అందరిని కలుపుకుపోతూ టీడీపీ నాయకుల సూచనల మేరకు ప్రజల్లోకి వెళ్తామని, ఖైరతాబాద్ నియోజకవర్గ అభివృద్ధే తమ ధ్యేయంగా పని చేస్తామని విజయారెడ్డి తెలిపారు.