టీడీపీలో అంటే ఒకప్పుడు తిరుగులేని పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. చంద్రబాబు హయాంలో ఆ పార్టీ హవా బాగానే కొనసాగింది. ఈ కారణంగానే ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఇంతలా పాతుకు పోయింది. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఏపీలో టీడీపీ రాజీకీయాలు చాలా దారుణంగా ఉన్నాయి. పోరాట పఠిమను మర్చిపోయినట్టు కనిపిస్తోంది. ఇలాగే ఇంకొన్ని రోజులు ఏపీలో పార్టీ పరిస్థితి కొనసాగితే మాత్రం చాలా కష్టమనే చెప్పాలి. ప్రజల్లో ఇప్పుడు ఉన్న కాస్త ఇమేజ్ కూడా పూర్తిగా దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది.
కాబట్టే ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలపై పోరాడేందుకు తన నాయకులను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తమకు మొదటి నుంచి మంచి పట్టున్న ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లపై ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. వారి సమస్యలపై పోరాడి మళ్లీ వారిలో అభిమానాన్ని దక్కించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.ఇక్కడ ప్రజల సమస్యలు దారుణంగా ఉన్నాయి. వీటిని పరిష్కరించి అభివృద్ధి ఎజెండాతో ముందుకు పోతే పార్టీకి కలిసి వస్తుందని చూస్తున్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రధానంగా నీటి సమస్యలు ఉన్నాయి. అలాగే చాలా జిల్లాల్లో వైద్యం, విద్యారంగాల్లో వెనకబడి ఉండటంతో ఈ సమస్యలపై ప్రధానంగా ఫోకస్ పెట్టి పరిష్కరిచేందుకు కొట్లాడాలని టీడీపీ భావిస్తోంది. ఎన్నికల సమయంలో చాలా పార్టీలు హామీలు ఇస్తూ ఉన్నా తీరా గెలిచాక ఎవరూ పట్టించుకోవట్లేదనే అపవాదు ఉంది. కాగా ఇప్పుడు టీడీపీ దీన్ని క్యాచ్ చేసుకుని మళ్లీ పట్టు పెంచుకునేందుకు రెడీ అవుతోంది. ఒకప్పుడు ఈ సమస్యలపై పవన్ పోరాడితే బాగానే రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్ప్ఉడు టీడీపీ కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందా లేదా చూడాలి.