కేసీఆర్ తిడుతుంటే బాధేస్తోంది : చంద్ర‌బాబునాయుడు

-

Chandrababu Naidu Fire On KCR
అమ‌రావ‌తి, (విజ‌య‌న‌గ‌రం) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థంకావడం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తెలంగాణకు తాను అన్యాయం చేయలేదని, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వారిలో తానే ముందు వరుసలో నిలిచానని చెప్పారు. మంగళవారం ఆయన విజయనగరంలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో మాట్లాడారు. తాను ఏనాడూ కేసీఆర్‌ను తిట్టలేదని ఆ అవసరం కూడా తనకు లేదన్నారు. కానీ ఆయన తనను తిడుతుంటే మాత్రం బాధేస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించ‌క‌పోతే కేసీఆర్‌ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పెట్టిన పార్టీ టిడిపి అని, పేదల పార్టీ అని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ తెలుగువారికి కష్టం వచ్చినా అండగా నిలబడే జెండా టిడిపి జెండా అన్నారు. తెలంగాణలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అనేక విద్యా సంస్థలు నెలకొల్పి విద్యా వికాసానికి తోడ్పాటునందించానని గుర్తుచేసుకున్నారు.

పవన్‌ నోట ఇప్పుడు మాట రావట్లేదు!
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.75వేల కోట్లు రావాలని నిపుణుల కమిటీ ద్వారా చెప్పారని, ఆ తర్వాత ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదని విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే దేశంలో భూకంపం వస్తుందన్న పవన్‌ ఈ రోజు కేంద్రంపై ఎక్కడా మాట్లాడటంలేదన్నారు. దేశంలో ఇన్ని పరిణామాలు జరుగుతుంటే ఆయన ఎందుకు మాట్లాడరని నిలదీశారు.

హైదరాబాద్ కాదు, సైబ‌రాబాద్ నేనే క‌ట్టా
తెలంగాణలో ఎన్నికలు వచ్చాయని, అక్కడ ప్రజాకూటమి కట్టడం న్యాయం కాదా? అని ప్రజలను అడిగారు. హైదరాబాద్ నగరాన్ని తానే కట్టానని ఎక్కడా చెప్పలేదని.. దాన్ని నిజాం కట్టాడన్నారు. సైబరాబాద్‌ను తానే కట్టానన్నారు. మైక్రోసాఫ్ట్‌, ఐటీ కంపెనీలు, ఐఎస్‌బీ, అంతర్జాతీయ విమానాశ్రయం తానే తీసుకొచ్చినట్టు చెప్పారు. తెలంగాణలో అనేక పాఠశాలలు, కళాశాలలు టిడిపి హయాంలో ఏర్పాటు చేసినవేనన్నారు. అందుకే తెలంగాణపై తెలుగుదేశానికి హక్కు ఉందన్నారు.

కేసీఆర్‌ అంటే జగన్‌, పవన్‌కు భయం
కేసీఆర్‌కు పవన్‌, జగన్‌ మద్దతు ఇవ్వడం న్యాయమా త‌మ్ముళ్లూ? అని చంద్ర‌బాబు ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలకు టిఆర్ ఎస్‌ చేసిందేమీ లేదని, చేయబోయేది కూడా ఏమీ ఉండదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు జ‌గ‌న్‌, పవన్ మ‌ద్ద‌తిచ్చి తెలంగాణలో పోటీచేయడం లేదని, కేసీఆర్‌ అంటే వాళ్లకు భయమన్నారు. కేవలం ఆంధ్రాలోనే పెత్తనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news