కేంద్ర మంత్రుల ముందే వైసీపీ, టీడీపీ ఎంపీల రచ్చ…!

-

ఈ నెల 31 నుంచి జరగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో స్పీకర్ అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసారు. పార్లమెంట్ లైబ్రరి హాల్ లో ఈ సమావేశం జరిగింది. ఈ నేపధ్యంలో వైసీపీ, టీడీపీ ఎంపీల మధ్య రచ్చ జరిగింది. టీడీపీ ఎంపీలు మాట్లాడుతుండగా వైసీపీ ఎంపీలు అడ్డు తగలడంతో వివాదం రేగింది. దీనితో కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ జోక్యం చేసుకున్నారు.

ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మీడియాకు వివరించారు. అఖిలపక్షంలో అమరావతి అంశాన్ని లో లేవనెత్తామన్న ఆయన… రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమరావతి రాజధానిని మార్చాలని చూస్తోందని, దీనిపై సభలో చర్చ జరగాలని కోరినట్టు ఆయన వివరించారు. మండలిలో రాజధాని తీర్మానం ఆగిపోయిందని మండలినే రద్దు చేయాలని చూస్తోందని… దీనిపై ఒక జాతీయ స్థాయి విధానం వుండేలా పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని కోరామని ఆయన చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. రైతులు, మహిళలు అందరిపై పోలీసుల దాడులను వివరించామని చెప్పిన ఆయన, ఎంపీగా వున్న తనపై కూడా పోలీసులు చేసిన దాడి, అక్రమ అరెస్టు పార్లమెంట్ సభ్యుడిగా నా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని స్పష్ట౦ చేసారు. అమరావతి పై తాము మాట్లాడుతుంటే వైఎస్సార్సీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారని ఆరోపించారు. రాజ్ నాథ్ సింగ్ తో పాటు, ఇతర పార్టీల నాయకులు మాకు మద్దతు తెలుపుతూ వైసీపీ ఎంపీలను అడ్డుకున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news