టీ లవర్స్.. ఇలా చేస్తున్నారా.. అయితే మీ ఆరోగ్యానికి ముప్పే..

-

ఉదయం లేచిన వెంటనే కప్పు చాయ్, కాఫీనో నోట్లో పడకపోతే కొందరికి ఏం తోచదు. ఇక రోజులో ఎన్నిసార్లు తాగుతారో లెక్కనే ఉండదు. హ్యాపీగా ఉన్నా.. బాధగా ఉన్నా.. నీరసంగా ఉన్నా.. అలసటగా ఉన్నా.. తలనొప్పిగా ఉన్నా కాస్త చాయ్ పడాల్సిందే. అదేంటో ఒక సిప్ చాయ్ కాఫీ పడగానే ఎంతో ఉత్తేజం వస్తుంది. చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. అయితే ఇలా రోజులో ఎప్పుడు పడితే అప్పుడు చాయ్, కాఫీ తీసుకోవడం మంచిది కాదంటున్నారు వైద్యులు. మరి ఏ సమయంలో తాగాలో తెలుసుకుందామా….

చాయ్ కాఫీ లవర్స్ కి లేవగానే కప్పు చాయ్ పడాల్సిందే. లేవగానే చాయ్ తాగుతూ అలా న్యూస్ పేపర్ తిరగేయడం చాలా మందికి అలవాటు. అయితే పరిగడుపున చాయ్ , కాఫీ తాగడం వ్యసనంగా మారిపోయింది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిద్రలేచిన వెంటనే బెడ్ కాఫీ తీసుకోవడం సరికాదు. ఈ ‘బెడ్-టీ కల్చర్’ ఆరోగ్యం విషయంలో ఆందోళన కలిగించే విషయం అవుతుందని అంటున్నారు.

అల్పాహారంతో పాటుగా టీ తాగడం అలవాటు చేసుకోవాలి. ఖాళీ కడుపుతో టీ తీసుకోవడం కొన్ని ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఖాళీ కడుపుతో చాయ్ లేదా కాఫీ తాగితే అది అజీర్ణం, గుండెల్లో మంటను కలిగిస్తుందని అంటున్నారు.

  • ఖాళీ కడుపుతో చాయ్, కాఫీలు తాగితే ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉంటాయంటే..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అది కడుపు ఉబ్బరం లేదా జీర్ణాశయంలో గ్యాస్ ఏర్పడటానికి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. టీ, కాఫీలు ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలో యాసిడ్-ఆల్కలీన్ సమతుల్యత దెబ్బతింటుందని తెలిపారు. ఇది ఎసిడిటీని కలిగిస్తుందన్నారు. కాబట్టిటి ఖాళీ కడుపుతో పాలతో తయారు చేసిన ఫీ, టీలు తీసుకోవద్దు. అయితే మీరు మేల్కొన్న తర్వాత గోరువెచ్చని నీటిలో ఒక చిటికెడు ఉప్పు, నల్ల మిరియాలు కలిపి కప్పు నిమ్మరసం లాంటి హెర్బల్ టీలు తాగవచ్చని చెప్పారు.

కాఫీలో ఉండే కెఫీన్ కలిగించే దుష్ప్రభావాల్లో మైకం ఒకటి. నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ తాగితే అది డీహైడ్రేషన్ కు కారణం అవుతుందని వైద్యులు తెలిపారు. మైకం కమ్ముకుంటుందని.. చురుకుగా అనిపించదని చెప్పారు.

టీ లో థియోఫిలిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది నిర్జలీకరణ ప్రభావాన్ని కలిగి.. మలాన్ని నిర్జలీకరణం చేస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య కలుగుతుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారం, పీచు పదార్థాలు ఇంకా వ్యాయామం వంటివి అలవాటు ఉంటే మలబద్ధకాన్ని నివారించవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఖాళీ కడుపుతో కాఫీ, టీలు తాగేవారిలో కొందరు అరిథ్మియాను అనుభవించినట్లు నివేదికలు తెలిపాయి. ఇది ముఖ్యంగా కెఫిన్ వల్ల కలిగే హార్ట్ బీట్ రేటు పెరుగుదల. ఈ క్రమరహిత హృదయ స్పందన ఒక విధమైన ఆందోళనను కలిగిస్తుందని డాక్టర్లు చెప్పారు.

ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటగా టీ లేదా కాఫీ తీసుకుంటే నోటిలోని బ్యాక్టీరియా టీ, కాఫీలోని చక్కెరను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది నోటిలో యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. ఈ కారణంగా దంత ఎనామిల్ కోతకు కారణమవుతుంది. దంత క్షయం, ఇతర నోటి సమస్యలు ఏర్పడవచ్చు.

కాబట్టి కాఫీ, టీలు ఎప్పుడు తాగినా కడుపు ఖాళీగా లేకుండా చూసుకోండి. అల్పాహారం, లేదా ఏవైనా స్నాక్స్ తింటూ తీసుకోవచ్చు. సాధారణంగా భోజనం చేసిన 1-2 గంటల తర్వాత టీ తాగడం ఉత్తమం. వర్కవుట్‌లకు ముందు కాఫీ తాగడం మంచిదని సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే ఇది మీకు శక్తినిస్తుంది అలాగే అదనపు కేలరీలను బర్న్ చేయడంలో సహాయ పడుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు.

నిద్రపోయే ముందు మాత్రం కాఫీ తాగడం మానుకోండి. ఇది రాత్రి సమయంలో చాలా సార్లు నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. నిద్రలేమి సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news