ఆర్మీ స్కూల్ లో ఉద్యోగాలు.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్ లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ పలు ఉద్యోగాలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

we are hiring

దీనిలో మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అప్లై చేయాలనుకునే వారు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 15 ఆఖరి తేదీ. ఇక ఖాళీల వివరాల లోకి వెళితే.. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(PGT) పోస్టులు వున్నాయి. సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పీజీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకి అర్హులు.

కెమెస్ట్రీ, బయోలజీ, ఫిసికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, కామర్స్, జియోగ్రఫీలో ఖాళీలు వున్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఖాళీలు కూడా వున్నాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ చేసి ఉండాలి. సోషల్ సైన్స్ లో మూడు, ఇంగ్లిష్-4, పీటీఐ-1, హిందీ-4, సంస్కృతం- 2, మాథ్స్-2 ఖాళీలు ఉన్నాయి.

పీఆర్టీ ఖాళీల వివరాలలోకి వెళితే.. ప్రైమరీ క్లాసెస్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు బోధించడానికి 25 మంది టీచర్ల ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ/డీఈడీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోచ్చు. అలానే ఫిజికల్ ఎడ్యుకేషన్ లో గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ట్రక్టర్ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. కనీసం ఐదేళ్లు అనుభవం ఉండాలి. భ్యర్థుల వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి. అప్లై చేసుకోవాలనుకునే https://apsrkpuram.edu.in/ ద్వారా పూర్తి వివరాలని చూసి అప్లై చేసుకోచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news