హైదరాబాద్‌ లో టీచింగ్ పోస్టులు…రాత పరీక్ష లేదు.. డిగ్రీ ఉండాలి..!

-

జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లో పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌ లోని ఈ విద్యా సంస్థలో ఉన్న పలు టీచింగ్ పోస్టుల కి ఈ కింద వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకో వచ్చు.

దీనిలో మొత్తం 47 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లో పోస్టుల విషయానికి వస్తే.. అసోసియేట్ ప్రొఫెసర్ – కమ్ – డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ – కమ్ – అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్-కమ్-డైరెక్టర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు వున్నాయి. అలానే హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌, లెక్చరర్ ఖాళీలు కూడా ఉన్నాయి.

ఇక సబ్జెక్ట్స్ విషయానికి వస్తే.. అరబిక్, హిందీ, ఉమెన్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, జువాలజీ, బోటనీ, ఫిజిక్స్, సోషల్ వర్క్, సోషియాలజీ అలానే ఎడ్యుకేషన్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసి ఉండాలి. అదే విధంగా పని అనుభవం ఉండాలి. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు హార్డ్‌ కాపీని నేరుగా వర్సిటీలో అందించాల్సి ఉంటుంది. ఇక ఫీజు విషయానికి వస్తే.. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు ఏమి పే చెయ్యక్కర్లేదు. ఇతరులు రూ. 500 ఫీజు చెల్లించాలి. 21-06-2023తో ఆన్ లైన్ లో అప్లై చేయడానికి సమయం ముగుస్తుంది. దరఖాస్తు హార్డ్‌ కాపీ స్వీకరణకు 27-06-2023ని చివరి తేదీ. పూర్తి వివరాల లోకి https://manuu.edu.in/ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news