సినిమాల్లో నటించిన భారత క్రికెటర్లు వీళ్లే!

-

టీమ్​ఇండియా క్రికెటర్​ శిఖర్​ ధావన్​ బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. స్టార్ హీరోయిన్స్​ సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన డబుల్​ ఎక్స్​ఎల్​లో అతిథి పాత్రలో నటించాడు. మరి ధావన్​ కన్నా ముందే సినిమాల్లో నటించిన భారత క్రికెటర్లు ఎవరో ఓ లుక్కేద్దాం.

ఇటీవల విడుదలైన విక్రమ్​ కోబ్రాలో భారత మాజీ ఫాస్ట్​ బౌలర్ ఇర్ఫాన్​ పఠాన్​ నటించారు. ముజ్​సే షాదీ కరోగీలో అతిథి పాత్రలో కనిపించారు. భారత్​కు తొలి వన్డే ప్రపంచకప్​ను అందించిన కపిల్​ దేవ్​ పలు సినిమాల్లో కనిపించారు. ఇక్బాల్​, ముజ్​సే షాదీ కరోగీ, చెయిన్​ కులీకి మే కులీ చిత్రాల్లో చిన్న పాత్రలో నటించారు.

సునీల్​ గావస్కర్​ క్రికెటర్​గా తన కెరీర్​ ముగిసిన తర్వాత పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. మరాఠీ చిత్రం సావ్లీ ప్రేమాచి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. భారత మాజీ స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ విక్టరీ, ముజ్​సే షాదీ కరోగీ, ఫ్రెండ్​షిప్​, డిక్కిలోనాతో పాటు మరో రెండు సినిమాల్లో నటించారు.

భారత మాజీ బ్యాటర్ వినోద్​ కాంబ్లీ 1991 నుంచి 2001 వరకు భారక క్రికెట్​కు ప్రాతినిధ్యం వహించారు. కొన్ని కారణాల వల్ల అర్ధాంతరంగా క్రికెట్​కు దూరమైన కాంబ్లీ 2002లో విడుదలైన అనర్థ్​ చిత్రంలో నటించి ఆకట్టుకున్నారు. వెటరన్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన 11ఏళ్ల వయసులో ఓ పంజాబీ సినిమాలో కనిపించాడు. యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ అనేక పంజాబీ, హిందీ చిత్రాలకు పనిచేశారు. యువరాజ్ సింగ్ భార్య హాజెల్ కీచ్ కూడా నటి కావడం విశేషం.

టీమ్​ఇండియా దిగ్గజ స్పిన్నర్​ అనిల్ కుంబ్లే కూడా ఒక హిందీ చిత్రంలో కనిపించారు. అనుపమ్ ఖేర్, మందిరా బేడీ నటించిన మీరాబాయి నాటౌట్‌ చిత్రంలో కనిపించారు. ఈ సినిమా 2008లో విడుదలైంది. భారత మాజీ ఆటగాడు నవజ్యోత్​ సింగ్​ పలు టీవీ షోల్లో పాల్గొంటూనే ముజ్​సే షాదీ కరోగీ, విక్రటీ, మేరా హింద్ వంటి చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించారు.

టీమ్​ఇండియాకు 1992-2000 మధ్య సేవలందించిన అజయ్​ జడేజా 2003లో ఖేల్​ చిత్రంలో నటించారు. భారత మాజీ ఫాస్ట్ బౌలర్​ శ్రీశాంత్​ అక్సర్​-2, క్యాబరెట్​, టీమ్​ 5 సహా పలు చిత్రాల్లో నటించారు. భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన, మాజీ కోచ్ సందీప్ పాటిల్ హిందీ చిత్రాలలో మెరిశారు. కభీ అజ్ఞాతవాసి సహా పలు చిత్రాల్లో కనువిందు చేశారు. త్వరలోనే గంగూలీ బయోపిక్​ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో దాదా కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news