కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర సర్కార్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు LTC సదుపాయాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సౌకర్యాలు సెప్టెంబర్ 25, 2024 లోగా వినియోగించుకోవచ్చు.

ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జమ్మూ కాశ్మీర్, లద్దాక్, అండమాన్-నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించవచ్చు. LTC కింద అర్హత గల ఉద్యోగులు రాను-పోను టికెట్ చార్జీలను తిరిగి పొందుతారు. ఇక కేంద్ర సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.