మెంతుల సాగులో పాటించాల్సిన మెళుకువలు..

-

మెంతి కూరలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలిసిందే.. దాంతో మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే..మన దేశం నుండి సౌదీ అరేబియా, జపాన్, శ్రీలంక, కొరియా , ఇంగ్లాండ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు..ఈ మొక్క సుమారుగా ఒక మీటరు ఎత్తు పెరుగుతుంది. పంట ఆకు కూరగా సాగు చేస్తే 25 రోజులు గింజల కోసమైతే 100 రోజుల సాగు వ్యవధి ఉంటుంది. ఎలాంటి వాతావరణంలో నైనా పెరుగుతుంది. చలి , గడ్డకట్టే వాతావరణాన్ని తట్టుకోగలదు. దీన్ని అత్యల్ప మోస్తరు వర్షపాతం కలిగిన ప్రదేశాల్లో సాగు చేసుకోవచ్చు. అధిక వర్షపాతం గల ప్రదేశాలు మాత్రం ప్రతికూలమైనవి. బంకమట్టి , క్షారగుణం కలిగిన నేలలు అనుకూలం.. మంచి దిగుబడిని అందిస్తాయి..

 

 

కో 1, రాజేంద్ర కాంతి, ఆర్ ఎంటి 1, లాం సెలక్షన్ 1 , కసూరి, ఆర్ ఎం టి 143, మేధి నెం 47, మేధి నెం 14, ఇసి 4911, హెచ్ 103, హిస్సార్ సొనాలి వంటి రకాలు మంచి దిగుబడిని ఇస్తాయి..భూమిని కనీసం మూడుసార్లు బాగా దుక్కిదున్ని ఏకరీతిగా మడులను తయారు చేసుకొని , వాటిపై విత్తనాన్ని వెదచల్లుకోవాలి. వరుసల మధ్య 20 సెంమీ దూరం ఉండేటల్లు నాటుకుంటే అంతర కృషి సులభంగా చేసుకునే వీలుకలుగుతుంది.. నవంబర్ నుంచి మార్చి నెలల్లో విట్టుకుంటారు..హెక్టారుకు 25 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తిన 8 రోజుల్లో విత్తనం మొలకెత్తటం ప్రారంభమౌతుంది. విత్తుకునే ముందు విత్తనాన్ని రైజోబియం కల్చర్ తో శుద్ధి చెయ్యడం మర్చిపోకండి..

ఇక ఎరువుల విషయానికొస్తే..హెక్టారుకు సుమారు 15 టన్నుల సేంద్రీయ ఎరువుతో పాటు , 25 కిలోల నత్రజని , 25 కిలోల భాస్వరం , 50 కిలోల పొటాష్ ఎరువులు అవసరం. సగం నత్రజని ఎరువు, మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను విత్తుకునే సమయంలోనే వేసుకోవాలి.. మిగిలిన సగం పంట వేసిన 30 రోజుల్లో వేసుకోవాలి..నత్రజని ఎరువును ఆకులు కత్తిరించిన ప్రతిసారి వేసుకోవాలి.. పది రోజులకొకసారి నీటి తడి ఇవ్వాలి.. ఇంకేదైనా సందేహాలు ఉంటే వ్యవసాయ నిపుణులను అడగటం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news