మాస్‌మహారాజ రవితేజ సింగర్‌గా మారారు. లేటెస్ట్గా తాను నటిస్తున్న రావణాసుర సినిమాలో ఓ పాట పాడారు. ప్యార్‌లోన పాగల్ అంటూ సాగే బ్రేకప్ సాంగ్‌ను పాడితూ సింగింగ్‌లోనూ తాను రాజేనని ప్రూవ్ చేశారు. లేటెస్ట్గా విడుదలైన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వర పరిచిన ఈ ట్యూన్ క్యాచీగా ఉంది. దానికి తగ్గట్లే కాసర్ల సాహిత్యం కిక్కెక్కిస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. రవితేజకు జోడీగా అను ఇమాన్యూయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లాలు నటిస్తున్నారు. అక్కినేని సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి రవితేజ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమా హిట్ల జోష్‌లో ఉన్న రవితేజ రావణాసురతో హ్యాట్రిక్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు.