తొమ్మిది వేలలోపే Tecno Spark 8P స్మార్ట్‌ ఫోన్..! 

-

Tecno నుంచి ఈ మధ్య ఒక ఫోన్‌ విడుదలకు రెడీ అయింది. తాజాగా Tecno Spark 8P ఫోన్‌కూడా పట్టాలెక్కనుంది. లో బడ్జెట్‌లో భారీ ర్యామ్‌తో ఫోన్‌ తీయాలనుకునే వారికి ఇది మంచి ఎంపికే..! ఇండియాలో లాంచ్‌ తేదీ ఇంకా ప్రకటించిలేదు కానీ..ఫీచర్స్‌ అయితే వెల్లడయ్యాయి.. మరి ఫోన్‌ విశేషాలేంటో మీరు చూడండి..!

స్పార్క్ 8P ధర, స్పెసిఫికేషన్స్

TECNO Spark 8P ధరను కంపెనీ ఇంకా వెల్లడించనప్పటికీ, అయితే Gizmochina తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఫోన్ టర్కోయిస్ సియాన్, ఐరిస్ పర్పుల్, అట్లాంటా బ్లూ, కోకో గోల్డ్ వంటి నాలుగు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
Spark 8P పూర్తి-HD+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఇది 20: 9 రేషియోతో దీన్ని రూపొందించారు.
ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ కెమెరా 8MP పంచ్-హోల్ ప్యానెల్ ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది.
50MP AI కెమెరాతో ప్రైమరీ సెన్సార్‌గా ఉంటుంది.
TECNO Spark 8Pలో MediaTek Helio G70 చిప్‌తో అమర్చారు..
ఈ ఫోన్‌లో 4GB RAM , 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజిని అందించారు.
ఈ ఫోన్‌లో ప్రత్యేక అంశం 7GB వర్చువల్ ర్యామ్‌తో అందుబాటులో ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4G కనెక్టివిటీతో డ్యూయల్-నానో-సిమ్ సపోర్ట్ ఉంది.
ఇది ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ అవుతుంది.
ధర ఇంకా వెల్లడించలేదు కానీ.. రూ. 9 వేల లోపే ఉంటుందని అంచనా.!

బ్యాటరీ సామర్థ్యం..

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ వోల్టే. గతేడాది నవంబర్లో ఫిలిఫిన్స్‌లో ఈ ఫోన్‌ లాంచ్‌ అయింది. మన దేశంలో లాంచ్‌ అయితే ప్రైమరీ కష్టమర్స్‌ను ఇది కచ్చితంగా ఆకట్టుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news