బీహార్ లోని పాట్నాలో సివిల్ కోర్టులో శుక్రవారం సాక్ష్యంగా సమర్పించిన ముడి బాంబు పేలింది. దీంతో కోర్టు ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది. ఆగమ్కువాస్ పోలీస్ స్టేషన్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ పేలుడు పదార్థాలతో కోర్టుకు చేరుకున్నారు. పేలుడు పదార్థాలను కోర్టు ఆవరణలోని టేబుల్ పై ఉంచి పేపర్ వర్క్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఓ సబ్ ఇన్స్పెక్టర్ తో సహా మరో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. పేలుడు ధాటికి అక్కడ ఉన్న చాలా మంది అధికారులు, న్యాయవాదులు రెండు నిమిషాల పాటు వినికిడి శక్తిని కోల్పోయారు.
దీంతో కోర్టు ఆవరణలో గందరగోళ వాతావరణం నెలకొంది. పేలుడు తరువాత పోలీసు ఉన్నతాధికారులు సివిల్ కోర్టుకు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు తరువాత ఆ ప్రాంతమంతా మసితో కప్పబడి ఉండడంతో ఏదో జరిగి ఉంటుందని గ్రహించినట్లు తెలిపారు. కోర్టుకు తీసుకు రావడానికి ముందు బాంబులను సరిగ్గా నిర్వీర్యం చేశారా లేదా అని తెలుసుకోవడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయని పిర్భహోర్ ఎస్హెచ్ఓ తెలిపారు.
Few days ago Gunpowder was recovered in Patel hostel,Patna University. We took it to court for seeking permission for further probe. Blast happened as soon as it was kept in premises. A police official sustained injuries & is out of danger: Sabi ul Haq, Incharge, Pirbahore PS pic.twitter.com/Q58vLYXdMV
— ANI (@ANI) July 1, 2022