టెక్నో స్పార్క్ ప‌వ‌ర్ 2 ఎయిర్ స్మార్ట్ ఫోన్ విడుద‌ల‌.. ధ‌ర ఎంతంటే..?

ట్రాన్సిష‌న్ ఇండియా కంపెనీ భార‌త్‌లో కొత్త‌గా టెక్నో స్పార్క్ ప‌వ‌ర్ 2 ఎయిర్ స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో 7 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో ఎ22 క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. వెనుక వైపు 13, 2, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఫింగ‌ర్ ఫ్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంటుంది. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని అమ‌ర్చారు.

TECNO Spark Power 2 Air smart phone launched

టెక్నో స్పార్క్ ప‌వ‌ర్ 2 ఎయిర్ స్పెసిఫికేష‌న్లు…

* 7 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1640 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌
* 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెస‌ర్‌, 3జీబీ ర్యామ్
* 32 జీబీ స్టోరేజ్‌, 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10
* డ్యుయ‌ల్ సిమ్‌, 13, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

టెక్నో స్పార్క్ ప‌వ‌ర్ 2 ఎయిర్ స్మార్ట్ ఫోన్ ఐస్ జేడియ‌ట్‌, కాస్మిక్ షైన్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. రూ.8499 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 20 నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ల‌భిస్తుంది.