టాలీవుడ్ లో మనకు ఉన్న అగ్ర హీరోయిన్ లలో ఒకరు ఎంతో సహజంగా నటించే కాజల్ అగర్వాల్.. అయితే ఈమె పెళ్లి చేసుకున్నాక కొంచెం, గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు కమల్ హాసన్ హీరోగా చేస్తున్నా భారతీయుడు 2 లో నటిస్తోంది. కాగా తాజాగా ఈమె ఒక సోషల్ మీడియా ఫ్యాన్ ఇంట్రక్షన్ లో మాట్లాడుతో తన కెరీర్ లో చేఇస్నా పాత్రలలో ఇష్టమైన పాత్రలు ఏమి అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ప్రభాస్ తో ఈమె నటించిన డార్లింగ్ మరియు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలను ముందుగా చెప్పింది. నిజంగా ఈ రెండు సినిమాలలో ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు అని చెప్పాలి .
ఇక రామ్ చరణ్ తో కెరీర్ ఆరంభంలో చేసిన మగధీర లో చేసిన మిత్రవింద మరియు సత్యభామ ల పాత్రలు అంటే కూడా చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. అంటే ఇండైరెక్ట్ ప్రభాస్ మరియు రామ్ చరణ్ లతో సినిమాలు చేయడం అంటే ఇష్టం అని చెప్పేసింది.