తేజస్వి మదివాడ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కేరింత సినిమాల ద్వారా తనకంటూ మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఈమె రామ్ గోపాల్ వర్మ కంట్లో పడడంతో ఐస్ క్రీమ్ సినిమా ద్వారా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల ఈమె నటించిన కమిట్మెంట్ సినిమాలో చాలా బోల్డ్ పాత్రలో నటించింది తేజస్వి. ఇక ఈ సినిమా ఈనెల 19వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజస్వి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించింది.
తేజస్వి మాట్లాడుతూ.. కథ డిమాండ్ చేస్తే బోల్డ్ క్యారెక్టర్ లో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని , కానీ ఆఫర్లు రావడం లేదు అని ఆమె తెలిపింది. అంతేకాదు ఇప్పటివరకు కేరింత సినిమాలో లాంటి పాత్ర దొరకలేదు అని కొంచెం అసహనం కూడా వ్యక్తం చేసింది తేజస్వి.. ఇకపోతే కంటెంట్ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నానంటూ తెలిపిన ఈమె 21 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను అని, ప్రస్తుతం తన వయసు 30 సంవత్సరాలు అని కూడా వెల్లడించింది. అంతేకాదు ఈ సినిమా మహిళా సాధికారత గురించి చర్చించే సినిమా .. మరో డర్టీ పిక్చర్ లాంటిది అంటూ ఆమె వెల్లడించింది.ఈ సినిమా తన రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటుందని, కమిట్మెంట్ సినిమాలో శ్రీరెడ్డి గురించి కూడా కొంచెం ఉంటుంది.. అలాగే వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి కూడా ఇందులో యాడ్ చేశామంటూ ఆమె తెలిపింది. శ్రీ రెడ్డి చేసే పనులన్నీ చేసి ఇప్పుడేం తెలియని అమాయకురాల్లాగా మాట్లాడుతోంది.. అన్నీ కానిచ్చేశాక ఇతరులపై నిందలు వేయడం ఎందుకో నాకు అర్థం కావడం లేదు అంటూ చర్చలకు దారితీసింది తేజస్వి. ఇక ఇలాంటి ఎన్నో విషయాలు కమిట్మెంట్ సినిమాలో ఉన్నాయని ఇక ఈ సినిమాలో తన పేరు కూడా తేజస్వి అంటూ చెప్పుకొచ్చింది. మరి తేజస్వి మాటలపై శ్రీ రెడ్డి ఏ రేంజ్ లో విజృంభిస్తుందో తెలియాల్సి ఉంది.