ఈ తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సెల్యూట్… నియోజకవర్గ ప్రజల కోసం 15 అంబులెన్స్ లు…!

తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రజలకు సేవ చేసే విషయంలో తన మార్క్ వేసారు. నియోజక వర్గ ప్రజల కోసం 15 ఉచిత అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రెండు అంబులెన్స్ లు ఒకటి సంగారెడ్డి మరొకటి సదాశివపేట లో అందుబాటులో ఉన్నాయి అని రెండు మూడు రోజుల్లో మరో 13 అంబులెన్స్ లు వస్తాయి అని ఆయన స్పష్టం చేసారు. అవసరం అయిన వారు 08455-278355 నంబర్ కు ఫోన్ చేయండి అని ఆయన సూచించారు.

ఇందులో రాజకీయం లేదు, పేద ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉచిత అంబులెన్స్ లు ఏర్పాటు చేశా అని స్పష్టం చేసారు. మా తల్లిదండ్రులు జయమ్మ, జగ్గారెడ్డి పేరుతో ఎప్పటినుంచో సేవ చేయాలనుకుంటున్న అని పెట్రోల్, డీజిల్ ఖర్చులు కూడా నేనే చిల్లిస్తా..ఎవరూ ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆయన స్పష్టం చేసారు. అంబులెన్స్ సేవలను పూర్తిగా ఉచితంగా వినియోగించుకోండి అని సూచించారు. గాంధీభవన్ లో ఇప్పటికే మూడు ఉచిత అంబులెన్స్ సేవలను జగ్గారెడ్డి ప్రారంభించారు.