దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి కాబట్టి వాక్సిన్ అనేది ఇప్పుడు కీలకంగా మారింది. వాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు సహకారం రావడం లేదనే ఆరోపణ చాలా వరకు వినపడింది. కేంద్ర ప్రభుత్వం వాక్సిన్ విషయంలో ముందు చూపుతో లేకపోవడంతో దేశం మొత్తం కూడా ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఇక తాజాగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కీలక ప్రకటన చేసారు.
2021 డిసెంబర్ నాటికి భారతదేశంలో పూర్తిస్థాయిలో కోవిడ్ -19 టీకాలు వేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటన చేసారు. దేశంలోని 130 కోట్లలో మూడు శాతం కంటే తక్కువ జనాభాకు కరోనా వాక్సిన్ వేసారని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడిన కేంద్ర మంత్రి… డిసెంబర్ నాటికి అందరికి వాక్సిన్ అందిస్తామని చెప్పారు.