వ్యాక్సిన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తీవ్ర వివాదాస్పదం అవుతుంది. వ్యాక్సిన్ కి సంబంధించి కేంద్రం ఒక ప్లానింగ్ లేకుండా వ్యవహరిస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రాష్ట్రాల్లో తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మంత్రి కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. వ్యాక్సిన్ ఉత్పత్తి ని 85 శాతం కేంద్రం వద్దే ఉంచుకుంది అని మండిపడ్డారు. కేంద్ర నిబంధనతో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అన్నారు.
15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారు అని ఆయన ఆరోపించారు. కంపెనీలు కూడా కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు నిర్ణయించాయి అని రాష్ట్రాలకు అనుకున్నంత సప్లై లేదు అని మండిపడ్డారు. కేంద్రానికి ముందు చూపు లేదు అని విమర్శలు చేసారు. ఆలోచించ కుండా వ్యాక్సిన్ ను విదేశాలకు ఇచ్చారు అని విమర్శలు చేసారు.