జనాలు కరోనాని లైట్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు కరోనా అంటే వణికి పోయిన జనం ఇప్పుడు కరోనా ఉందా లేదా అని అనుమానం కలిగేలా తిరిగేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ కేసులో కూడా భారీగా నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణ కరోనా పరిస్థితుల మీద తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా ను లైట్ తీసుకోవద్దని, పండుగలు వస్తున్నా సందర్భంగా కరోనా సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కరోనా లేదని భ్రమ పడవద్దన్న ఆయన సెకండ్ వేవ్ మాత్రమే కాదు మరిన్ని వేవ్ లు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ఈ చలి కాలంలో కరోనాతో పాటు ఇతర వైరస్ లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. కోవిడ్ వ్యాకిస్ రావటానికి సమయం పడుతుందన్న ఆయన తప్పకుండా, మాస్క్, శానిటేషన్ వాడాలని అన్నారు. అంతే కాదు త్వరలో గాంధీ హాస్పిటల్ లో పోస్ట్ కరోనా వార్డులను కూడా ఏర్పాటు చేస్తామని అయన అన్నారు. నిజానికి పోస్ట్ కరోనా అంటే కరోనా వచ్చి తగ్గాక వస్తున్న ఎఫెక్ట్స్ వలన చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.