కరోనా కారణంగా దాదాపుగా సంవత్సరం పాటు మూతబడ్డ విద్యాలయాలు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండీ తెరుచుకోనున్నాయి. కరోనా వ్యాప్తి తగ్గుదల, వ్యాక్సిన్ కూడా వచ్చేయడంతో మెల్లమెల్లగా అన్నీ ఓపెన్ అవుతున్నాయి. అందులో భాగంగానే విద్యాలయాలు తెరుచుకోనున్నాయి. ఐతే పాఠశాలల్లో తొమ్మిది, పదవ తరగతి వారికి మాత్రమే క్లాసులు జరుగుతాయి. మిగతా క్లాసుల వారికి యధావిధిగానే ఆన్ లైన్లో క్లాసులు జరగనున్నాయి. పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ని విడుదల చేయనుంది.
ఫిబ్రవరి 1వ తేదీ నుండి మొదలైన పాఠశాల మే 26వ తేదీ వరకు జరగనుంది. మార్చి 15వ తేదీలోగా ఫార్మేటివ్ అసెస్ మెంట్ -1 పరీక్ష, ఏప్రిల్ 15వ తేదీలోగా ఫార్మేటివ్ అసెస్ మెంట్ -2పరీక్ష, మే 7వ తేదీ నుండి 13వరకు తొమ్మిదవ తరగతికి ఫైనల్ ఎగ్జామ్స్, అలాగే మే 17- 26వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. విద్యాశాఖ రూపొంచిందిన ఈ క్యాలెండర్ ని తెలంగా్ణ ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది.