తెలంగాణ అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌!

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. మరో రెండు జాబ్‌ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. యాదాద్రి–భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ జిల్లాల్లో ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్‌ పోస్టులున్నాయి. యాదాద్రి–భువనగిరి– 57 ఖాళీలు, సంగారెడ్డి – 43 పోస్టులున్నాయి. యాదాద్రి–భువనగిరి జిల్లాలోని పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 ఆగస్ట్‌ 25 చివరి తేదీ కాగా, సంగారెడ్డి ఆగస్ట్‌ 27 చివరి తేదీ. పూర్తి వివరాలను https://mis.tgwdcw.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

jobs
jobs

మొత్తం ఖాళీలు– 57 ఉండగా, అందులో అంగన్వాడీ టీచర్‌– 8
అంగన్వాడీ ఆయా– 45, మినీ అంగన్వాడీ టీచర్‌– 4

విద్యార్హతలు– 10వ తరగతి పాస్‌ కావాలి.
స్థానికంగా నివసించేవారు, కేవలం పెళ్లైన మహిళలు మాత్రమే అప్లై చేయాలి. స్థానిక గ్రామపంచాయతీలో నివసించేవారికే అవకాశం. 2021 జూలై 1 నాటికి 21– 35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస వయస్సు 18 ఏళ్లు.

  • నోటిఫికేషన్‌ చదివిన తర్వాత అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు అప్లికేషన్‌ ఫామ్‌ పైన క్లిక్‌ చేయాలి.
  • మీరు దరఖాస్తు చేసే పోస్ట్‌ పేరు సెలెక్ట్‌ చేయాలి.
  • జిల్లా, ప్రాజెక్ట్, అంగన్వాడీ సెంటర్‌ను ఎంచుకోవాలి.
  • అభ్యర్థి పూర్తి వివరాలతో దరఖాస్తు ఫామ్‌ పూర్తి చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్స్‌ జత చేయాలి.
  • అప్లికేషన్‌ ఫామ్‌ ప్రింట్‌ తీసుకోవాలి.