ఈటల సమక్షంలో బీజేపీలో చేరికలు…

కరీంనగర్ జిల్లా : జమ్మికుంట పట్టణంలోని కృష్ణ కాలనిలో మాజీ మంత్రి, బిజేపి నేత ఈటెల రాజేందర్, మాజీ ఎంపి వివేక్ సమక్షంలో పలువురు నేతలు బిజెపి పార్టీ లో చేరారు. అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. పదవుల కోసం పెదవులు మూయద్దని, కెసిఆర్ సీఎం అయిన తర్వాత అనేక అంశాలపై ఆయనతో పెనుగులాడానని చెప్పారు.

బయటికి చెప్పకపోయిన, అంతర్గతంగా కొట్లడానని… తపన అభిప్రాయం నిఖచ్చగా చెప్పానని తెలిపారు. అవన్ని కంట్లో పెట్టుకొని నిన్న వచ్చి…పంట్లేకెళ్ళి తీసిపోయాడని మండిపడ్డారు. ఎప్పుడు తాను పేద ప్రజల కోసం కొట్లాడే బిడ్డనని… ఎవరికి ఆపద వచ్చిన కో అంటే కో అనే బిడ్డను తానని స్పష్టం చేశారు.. రాజీనామా చేసిన తర్వాత నన్ను ఓడించడానికి ఎన్ని వస్తున్నాయో ప్రజలు గమనించాలని తెలిపారు. ఇంతకు ముందు పెన్షన్ రేషన్ కార్డు రావాలన్న సీఎం ఆఫీస్ కి పోవాల్సి వచ్చేదని వెల్లడించారు. అధికారాన్ని చేజిక్కించుకొని చెర బట్టిన వ్యక్తి కెసిఆర్ అని మండిపడ్డారు.