సొంతపార్టీలో సంజయ్ కి కొత్త టెన్షన్

-

తెలంగాణ బీజేపీ చీఫ్ సంజయ్ కి ఇప్పుడు పార్టీలో కొత్త టెన్షన్ మొదలైందట. పార్టీ కమిటీలు ఏర్పాటు చేయమని ఇంచార్జ్ సూచించినా పక్కన పెట్టడం..పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెంచిన కార్యవర్గం పై మాత్రం సంజయ్ వర్గం గోప్యత పాటించడం కమిటీల కూర్పులో ఉన్న మతలబు పై ఇప్పుడు కమలనాథుల్లో ఆసక్తికర చర్చ నడుస్తుందట..

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్

గత ఏడాది మార్చిలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడుగా వచ్చారు బండి సంజయ్. కరోనా కారణంగా రాష్ట్ర పదాధికారుల ప్రకటన ఆలస్యమైంది. ఎట్టకేలకు గత ఏడాది సెప్టెంబర్‌లో ఆ తంతు పూర్తి చేశారు. బీజేపీ అనుబంధ మోర్చాలకు అధ్యక్షులను ప్రకటించారు. పూర్తి కమిటీలు మాత్రం వేయలేదు. దీంతో పార్టీ పదవులు ఆశిస్తున్న వారికి ఎదురు చూపులు తప్పడం లేదు. మొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగినా అన్ని కమిటీలు కొలిక్కి రాలేదు.

కార్యవర్గం లేకుండా రాష్ట్ర సమావేశం నిర్వహించడం పై నేతలు గుస్సా అవుతున్నారట. అసలు ఈ సమావేశానికి ముందే రాష్ట్ర కార్యవర్గాన్ని.. జిల్లా ఇంఛార్జ్‌లను.. మోర్చా కమిటీలను.. అనుబంధ విభాగాల పార్టీ పదవులను వెల్లడిస్తారని లెక్కలేసుకున్నారట పార్టీ నేతలు..కానీ సమావేశం పై కూడా గోప్యత పాటిస్తూ మీటింగ్‌కి ముందు రోజు కొందరు నాయకులకు రాత్రి మెసేజ్‌లు పంపించారట. పోనీ ఆ మెసేజ్ లు వచ్చినవారికన్నా ఓ క్లారిటీ ఇచ్చారా అంటే అది లేదంటా ఇప్పుడిదే అంశం పై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఎవరికి చోటు దక్కుతుంది.. పదవి ఇవ్వనప్పుడు ఎందుకు మీటింగ్‌కు పిలిచారు అని మీటింగ్ కి వచ్చిన నేతలు తమలో తాము చర్చించుకున్నారట. రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించేందుకు ఇంత రహస్యం ఎందుకు అని కొందరు నేతలు అక్కడే ఫైరయ్యారట. పక్క రాష్ట్రం ఏపీలో పార్టీ కమిటీలు కొలిక్కి వస్తున్న ఇక్కడ ఎందుకు జాప్యం చేస్తున్నారని సంజయ్ వర్గాన్ని ప్రశ్నిస్తున్నారట నేతలు. కనీసం రాష్ట్ర కార్యవర్గంలో ఎవరుంటారో.. ఎవరికి చోటు దక్కుతుందో క్రియాశీల కార్యకర్తలకు అయినా తెలియాలి కదా అని నిట్టూర్పులు విడుస్తున్నారట…

బీజేపీ మహిళా మోర్చాకు తప్ప మిగతా మోర్చాలకు పూర్తిస్థాయిలో రాష్ట్ర కమిటీలను వేయలేదు. ఆయా మోర్చాలలో పార్టీ పదవులు పట్టేందుకు ఎవరిస్థాయిలో వారు లాబీయింగ్‌ చేసుకుంటున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ నేతల్లో టెన్షన్‌ పెరిగిపోతోందట. మరీ పార్టీ అధ్యక్షుడు సంజయ్ దీనికి ఏ పరిష్కారం చూపుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news