ఎదుటివారు మీ ప్రేమలో మునిగి తేలాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు…

Join Our Community
follow manalokam on social media

ప్రేమ.. ప్రపంచమంతా దీనికోసమే పరుగెడుతుంది. ఒక పనిచేస్తే అది బాగుందన్న మాటలు రావాలంటే ప్రేమ కావాలి. మీరేం చేసినా, ఎంత సంపాదించినా, దాన్ని ఒక్కరైనా పొగడడం లేదంటే మీ జీవితంలో ప్రేమ శూన్యం అన్నమాట. ఎంత డబ్బు సంపాదించావన్నదానికంటే ఎంత ప్రేమను పొందావన్నది ముఖ్యం. ఐతే ప్రస్తుతం చేతిలో డబ్బుంటే ఆటోమేటిక్ గా ప్రేమలు పుట్టుకొచ్చేస్తున్నాయి. అలాంటి వాటిని పక్కన పెడితే ఎదుటివారిని మీ ప్రేమలో పడేయడానికి కావాల్సిన టిప్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

బాధల్లో ఉన్నప్పుడు దగ్గరే ఉండాలి.

అవును. ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు వారి బాధల్లో పాలు పంచుకుంటేనే ఆ ప్రేమ మరింత బలపడుతుండి. అలాగే ఎదుటివారికి మీరున్నారన్న భావం మీపై ఎక్కువ ప్రేమను కలిగించేలా చేస్తుంది.

ఏ టైమ్ లో మీరు అందుబాటులో ఉండకూడదో తెలుసుకోవాలి.

పైన్ చెప్పిన మొదటి పాయింట్ కి రెండవ పాయింట్ పూర్తి విరుద్ధంగా అనిపిస్తుండవచ్చు. కానీ దానికీ, దీనికీ చాలా తేడా ఉంది. కొన్ని కొన్ని సార్లు అందుబాటులో ఉండకపోవడం వల్ల ప్రేమ పెరుగుతుంది. దూరమైన మనుషుల మధ్య కలిగే విరహం ప్రేమని పెంచుతుంది.

ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి

మీరు నమ్మినా, నమ్మకపోయినా ఎప్పుడూ కనిపిస్తూ ఉంటే ప్రేమలో పడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎంత సోషల్ మీడియా వచ్చినా కానీ, భౌతికంగా మీ దగ్గరితనం ప్రేమని ఎక్కువ చేస్తుంది.

అప్పుడప్పుడు సాయం అడగండి.

మీకు అవసరం లేకపోయినా సాయం అడగండి. దానివల్ల మీ ఇంపార్టెన్స్ వారి జీవితంలో ఎంత ఉందనేది తెలుస్తుంది. వారి ఈగో సంతృప్తి చెంది, మీ పట్ల ఇష్టాన్ని పెంచుతుంది.

TOP STORIES

అందరి ముందు మాట్లాడాలంటే భయమా…? అయితే ఇది మీకోసం…!

చాలా మంది కింద చాలా బాగా మాట్లాడతారు. కానీ ఒక్కసారి అందరి ముందు నిలబడి మాట్లాడాలంటే చేతులు వణికి పోతాయి. అలానే పేనిక్ అయిపోతుంటారు. ఇది...