Telangana budget 2023-24 : నేడే తెలంగాణ బడ్జెట్

-

2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఇవాళ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో… శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం 10 గంటలా 30 నిమిషాలకు ఉభయ సభల సమావేశాల ప్రారంభంతో నేరుగా బడ్జెట్ ప్రసంగం ఉంటుంది.

బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు శాసనసభకు వచ్చే ముందు మంత్రి హరీశ్‌రావు జూబ్లీహిల్స్ లోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం 11వ బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది.

ఇందులో 10 పూర్తిస్థాయి బడ్జెట్‌లు కాగా ఒకటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్. 2018 ఎన్నికల అనంతరం 2019 లో రాష్ట్ర ప్రభుత్వం మొదట ఓటాన్ అకౌంట్, ఆ తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది రాష్ట్ర శాసనసభ ఎన్నికల జరుగుతున్న వేళ మరోమారు బడ్జెట్ ప్రవేశపెడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news