తెలంగాణలో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగింపు.. మార్గదర్శకాలు ఇవే

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర మంత్రివ‌ర్గం ఇవాళ భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్ర‌గతి భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ స‌మావేశానికి మంత్రులు హాజ‌ర‌య్యారు. అయితే ఈ సమావేశంలో లాక్ డౌన్ పై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మరో పది రోజులు లాక్‌డౌన్‌ పొడిగిస్తు నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఉ. 6 గంటల నుంచి సా. 5 గంటల వరకు సడలింపులు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోగా…

సా. 5 గంటల నుంచి సా. 6 గంటల వరకు గంటపాటు ఇంటికి చేరుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇక సా. 6 గంటల నుంచి ఉ. 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు కానుంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి.. నకిరేకల్‌ మినహా మిగతా నల్లగొండ జిల్లాలో ప్రస్తుత లాక్‌డౌన్‌ స్థితి కొనసాగుతుందని నిర్ణయం తీసుకుంది సర్కార్.